TTD: శ్రీవారి దర్శన బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు
ABN , First Publish Date - 2022-10-30T17:08:39+05:30 IST
శ్రీవారి దర్శన బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టయింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు (police) పట్టుకున్నారు. 12 టికెట్లను రూ.38 వేలకు భక్తులకు దళారీ కరుణాకర్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు.
తిరుమల: శ్రీవారి దర్శన బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టయింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు (police) పట్టుకున్నారు. 12 టికెట్లను రూ.38 వేలకు భక్తులకు దళారీ కరుణాకర్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. కాణిపాకం ఆలయం (Kanipakam temple)లో కాంట్రాక్ట్ గ్యాస్ ఆపరేటర్‌గా కరుణాకర్ పనిచేస్తున్నాడు. కాణిపాకం ఆలయ పీఆర్‌వో అంటూ తిరుమలలో చలామణి అవుతున్నాడు. గతంలోనూ దర్శన టికెట్లు అమ్ముతూ నిందితుడు పట్టుబడ్డాడు. ఈ రోజు ఏఈవో మాధవ్‌రెడ్డితో కలిసి సుపథం టికెట్లు అమ్మినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోకు ఈవో మెమో జారీ చేయనున్నారు.