TTD: నిమిషాల్లో అమ్ముడుపోయిన శ్రీవారి దర్శన టికెట్లు

ABN , First Publish Date - 2022-11-11T20:51:35+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ (TTD) శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది.

TTD: నిమిషాల్లో అమ్ముడుపోయిన శ్రీవారి దర్శన టికెట్లు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ (TTD) శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. డిసెంబరు నెల టికెట్ల కోటాను అక్టోబరులోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే వీఐపీ బ్రేక్‌ (VIP Break) దర్శన సమయాన్ని డిసెంబరు (December) నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న క్రమంలో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో విడుదల చేసింది. 11.20 గంటల సమయానికంతా భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో టికెట్లను వేగంగా బుక్‌ చేసుకున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ ద్వారా టికెట్ల కోటాను విడుదల చేయడంతో ఎలాంటి సాంకేతి సమస్య లేకుండా భక్తులు సులభతరంగా టికెట్లను పొందారు. ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.15.20 కోట్ల ఆదాయం సమకూరింది.

Updated Date - 2022-11-11T20:51:36+05:30 IST