Nallari: బీసీలపైనే దాడి చేసి పైగా BC సభలు పెడతారా?
ABN , First Publish Date - 2022-12-05T14:17:07+05:30 IST
జనసేన నాయకుడు రామచంద్రయాదవ్(Janasena leader Ramachandra Yadav) ఇంటిపై వైసీపీ మూకల దాడి దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు టీడీపీ
చిత్తూరు: జనసేన నాయకుడు రామచంద్రయాదవ్(Janasena leader Ramachandra Yadav) ఇంటిపై వైసీపీ మూకల దాడి దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు టీడీపీ ఇంఛార్జి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి(Nallari Kishore Kumar Reddy) ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఓ బీసీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. రైతు సమస్యలపై సదస్సు నిర్వహించడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడి చేయడమే వైసీపీ నేతలకు తెలిసిన రాజకీయమా? అంటూ నిలదీశారు. ఓ వైపు బీసీ నేతలపై దాడి చేసి మళ్లీ బీసీ సభ అంటూ డ్రామాలు ఆడటం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. బీసీల హక్కుల్ని హరిస్తూ.. బీసీల సభలు పెట్టడం వైసీపీ లాంటి డ్రామా పార్టీకే చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.