Audio launch: అమలాపురంలో ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలిక ఆడియో ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-12-12T12:50:46+05:30 IST

ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలికను శ్రీకంచి శంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి ఆవిష్కరించారు.

Audio launch: అమలాపురంలో ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలిక ఆడియో ఆవిష్కరణ

అమలాపురం: ఆంధ్ర మహాభారతం 108 పద్యగానమాలిక (Andhra Mahabharata 108 Padyamalika)ను కంచి శంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి (Kanchi Shankara Vijayendra Sarvaswati Swami) ఆవిష్కరించారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ (Dr. Ghazal Srinivas) గానం చేసిన కవిత్రయం రచించిన పద్యగానమాలిక ఆడియో ఆవిష్కరణ ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పేరురులో ఘనంగా జరిగింది. ఆడియోను ఆవిష్కరణ అనంతరం స్వామిజీ మాట్లాడుతూ... కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని పద్యాలు బాల బాలికలు, యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమని అన్నారు. ఈ పద్యాల వల్ల తెలుగు బాషా వైభవం, భక్తి తత్వం, అత్యంత సుందరమైన భావ వ్యక్తీకరణ అర్ధం అవుతాయని తెలిపారు.

శ్రీ కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి (Sri Kanchi Paramacharya Sri Sri Sri Chandrasekharendra Saraswati Mahaswami) జన్మదిన సందర్భంగా డిసెంబర్ 20 కొవ్వూరు సంస్కృత విద్యా పీఠం వేదికగా వేలాదిమంది బాల బాలికలచే ఈ 108 పద్యాలను వివిధ ప్రాంతాల నుండి ఒకే సమయంలో సామూహికంగా గానం చేయించే ప్రయత్నం కంచి కామాక్షి పీఠం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 108 పద్యాలను అందరూ సులువుగా పాడుకునే విధంగా గానం చేసి ధ్వని ముద్రితం చేసిన సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్‌ను కంచి శంకర విజయేంద్ర స్వామి అభినందిస్తూ తీర్ధ ప్రసాదాలను అందించారు.

gazal-vijaya.jpg

Updated Date - 2022-12-12T12:50:47+05:30 IST