AP News: ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోంది : కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-10-30T18:16:40+05:30 IST

ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమయ్యిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు.

AP News: ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోంది : కొల్లు రవీంద్ర

ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమయ్యిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఏలూరు జిల్లా కైకలూరు పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.1.50 ఇస్తామని చెప్పి ప్రస్తుతం రూ.5.50 వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న రైతుల పాదయాత్ర‌పై ఎమ్మెల్యే, ఎంపీల వారి కార్యకర్తలతో దాడులు చేయించి ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే టీడీపీ ఆధ్వర్యంలో కృష్ణ, ఏలూరు జిల్లాల నుంచి విశాఖ ఉత్తరాంధ్ర వరకు సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-10-30T18:16:42+05:30 IST