Home » Kollu Ravindra
ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.
వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఎర్నీ బదలబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Andhrapradesh: మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.
ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయని నిలదీశారు.
మద్యం, ఇసుక దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలోని 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించగా.. రికార్డుస్థాయిలో 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.