Health Minister Rajani: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్
ABN , First Publish Date - 2022-12-12T18:22:32+05:30 IST
Guntur: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ విధానంలో పల్లెవాసులకు
Guntur: ఉగాది నుండి ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ విధానంలో పల్లెవాసులకు మెరుగైన వైద్యం అందనుందని చెప్పారు. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH)లో నాట్కో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మమోగ్రఫీ పరికరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.కోటి విలువ చేసే మామోగ్రఫీ పరికరం రాష్ట్రంలోనే మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిందన్నారు. క్యాన్సర్‌తో ఎక్కువ మంది మహిళలు మృత్యువాత పడుతున్నారని, విశాఖ (Vizag)లోనూ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు హోమిబాబా ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో పల్లెవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య పరికరాలను తక్షణమే మరమ్మతులు చేయించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు పూర్తి అధికారాలిచ్చామని తెలిపారు.