Bapatla Dist.: వివాదంగా మారిన వైసీపీ కార్యాలయ నిర్మాణం..
ABN , First Publish Date - 2022-12-19T15:58:31+05:30 IST
బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీకు ఆఫీస్‌కు అధికారులు కేటాయించారు.
గుంటూరు జిల్లా: బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీస్‌కు అధికారులు కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజ చేశారు. దీంతో బాపట్ల ఆర్టీసీ డిపో సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ స్థలంలో ఆఫీస్ ఎలా కడతారని ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించిందని మంత్రులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ డీఎం పోలీసులు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. 1990లో తాము ఏపీఐఐసీ నుంచి ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ అనుమతి లేకుండా వైసీపీ ఆఫీస్‌కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.