Tadepalli: మళ్లీ మాటమార్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి
ABN , First Publish Date - 2022-12-12T15:50:49+05:30 IST
తాడేపల్లి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ మాట మార్చారు. రాష్ట్రానికి జగన్ ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపనలపైనే తాను మాట్లాడానన్నారు.
తాడేపల్లి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishnareddy) మళ్లీ మాట మార్చారు. రాష్ట్రానికి జగన్ (Jagan) ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆరోపణలపైనే తాను మాట్లాడానన్నారు. సమైక్యం కోసం వైఎస్ఆర్ పార్టీ తొలి నుంచీ పోరాడుతోందని చెప్పానన్నారు. విభజన జరిగి 8 ఏళ్లు దాటినా.. రాష్ట్ర విభజనపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉందన్నారు. ఆర్టిరల్ 3 ప్రకారం డివిజన్ జరగలేదని.. అసెంబ్లీ తీర్మానం ప్రకారం జరగలేదని.. ఒకవేళ కోర్టు చెబితే సమైక్యమే తమ విధానమని చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం కలిసుండాలని కోర్టులో తీర్పువస్తే ముందుగా తామే స్వాగతిస్తామన్నామని.... అయితే తాజాగా ఇన్నేళ్ళ తరువాత ఎలా సాధ్యమవుతుందంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్లేటు ఫిరాయించారు.