Yarapatineni: ప్రభుత్వం మారగానే ఆ ఖాకీల పని పడతాం

ABN , First Publish Date - 2022-12-21T13:03:45+05:30 IST

ఎలాంటి కేసులు లేకపోయినా టీడీపీ కార్యకర్తలను అక్రమంగా పోలీసులు తీసుకెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Senior TDP leader Yarapatineni Srinivasa Rao) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో

Yarapatineni: ప్రభుత్వం మారగానే ఆ ఖాకీల పని పడతాం
ప్రభుత్వం మారగానే ఆ ఖాకీల పని పడతాం

పల్నాడు: ఎలాంటి కేసులు లేకపోయినా టీడీపీ కార్యకర్తలను అక్రమంగా పోలీసులు తీసుకెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Senior TDP leader Yarapatineni Srinivasa Rao) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దుర్గి, నాగార్జునసాగర్ స్టేషన్లలో టీడీపీ శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (YCP MLA Pinnelli Ramakrishna Reddy) చెప్పినట్లే పోలీసులు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే ఎవరినీ వదిలిపెట్టబోమని పోలీసులను హెచ్చరించారు. ఇప్పుడు అక్రమాలకు పాల్పడే పోలీసులు రేపు నిందితులుగా మారతారని వార్నింగ్ ఇచ్చారు. డీజీపీ(Ap DGP Rajendranath Reddy)కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం... టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టే పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుందని యరపతినేని భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-21T13:03:46+05:30 IST