Kollu Ravindra: ఎం చేశావని గర్జిస్తావ్ జగన్ రెడ్డీ?..

ABN , First Publish Date - 2022-12-07T11:24:03+05:30 IST

వైసీపీ (YCP) బీసీ (BC) గర్జన సభపై టీడీపీ (TDP) బీసీ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Kollu Ravindra: ఎం చేశావని గర్జిస్తావ్ జగన్ రెడ్డీ?..

అమరావతి: వైసీపీ (YCP) బీసీ (BC) గర్జన సభపై టీడీపీ (TDP) బీసీ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎందుకు గర్జన... ఎవరి మీద గర్జన...ఎం చేశావ్ అని గర్జిస్తావ్ జగన్ రెడ్డీ? (Jagan reddy).. సలహాదారుల పేరిట నీ కులానికి జనాల సొమ్ము దోచి పెడుతున్నావ్ అని గర్జిస్తావా... బీసీలకు 50 కార్పొరేషన్లు అని, కోట్ల రూపాయల యాడ్‌లు వేసుకుని, చివరికి ఆఫీసు కాదు కదా ఆఫీసుకి కుర్చీ కూడా లేదని గర్జిస్తావా... సామాజిక న్యాయం అని నువ్వు చెప్పేదంతా అబద్ధం... నువ్వు చేసేది అంతా మోసం అని గర్జిస్తావా... బీసీలను వెన్నుపోటు పొడిచి, 26 మంది బీసీలను హత్య చేశావని సైకో (Psycho) ఆనందంతో గర్జిస్తావా... అసలు జయహో బీసీ అనేది తెలుగుదేశం 2019లో చేసిన కార్యక్రమం, దానిని కాపీ కొట్టి స్టికర్ వేసుకున్నా అని గర్జిస్తావా... ఇంకొకసారి పులి అని గర్జన అని ఎలివేషన్స్ ఇచ్చుకోకు... నువ్వు పిల్లివి అని పరదాల కట్టే నీ పార్టీ కార్యకర్తలకే అర్థం అయిపోయింది... నిన్ను నమ్మే స్థితిలో ఎవడూ లేడు... ముఖ్యంగా బీసీలు అసలు నమ్మరు...’’ అంటూ కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-07T11:24:30+05:30 IST