AP News: ఏ ఒక్క వాగ్దానాన్ని జగన్ నెరవెర్చలేదు: అమర్నాథ్ రెడ్డి
ABN , First Publish Date - 2022-12-26T19:06:05+05:30 IST
Chittor: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ(TDP)నే టార్గెట్ చేసుకుని వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
Chittor: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ(TDP)నే టార్గెట్ చేసుకుని వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (Ex Minister Amarnath Reddy) ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని జగన్ (CM Jagan) నెరవేర్చలేదన్నారు. చిత్తూరు జిల్లాలో విజయ సహకార పాల డైరీ, చక్కెర కర్మాగారాలను తెరిపించలేకపోయాడని పేర్కొన్నారు. విజయ సహకార పాల డైరీని 99 సంవత్సరాలకు అమూల్‌కు లీజుకు ఇచ్చాడా? లేక అప్పనంగా అప్పజెప్పాడా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు మోతతో పక్క రాష్ట్రాలకు ప్రజలు వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం దారుణమన్నారు. హంద్రీనీవా సహా ఏ ఒక్క ప్రాజెక్టును పట్టించుకోలేదని, గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీరం చేశారని పేర్కొన్నారు.