AP News: కడప జిల్లా కోర్టుకు టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-10-31T12:05:13+05:30 IST

ఎస్సీ ఎస్టీ కేసులో టీడీపీ నేతలు సోమవారం ఉదయం జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

AP News: కడప జిల్లా కోర్టుకు టీడీపీ నేతలు

కడప: ఎస్సీ ఎస్టీ కేసులో టీడీపీ నేతలు (TDP Leader)సోమవారం ఉదయం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita), ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTec Ravi), ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు(MS Raju)లతో పాటు స్ధానిక నేతలు కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైంది. దళిత మహిళకు మద్దతుగా పులివెందులలో ర్యాలీ చేసిన 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అనిత (TDP state woman president) మాట్లాడుతూ... కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని విమర్శించారు. దళితులమైన తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. సీఎం జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని అనిత (TDP Leader) హెచ్చరించారు.

Updated Date - 2022-10-31T12:05:14+05:30 IST