Wishes: చిరంజీవికి ఏపీ గవర్నర్ అభినందనలు

ABN , First Publish Date - 2022-11-21T11:45:32+05:30 IST

మెగాస్టర్ చిరంజీవిని ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ అభినందించారు.

Wishes: చిరంజీవికి ఏపీ గవర్నర్ అభినందనలు

విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ 2022 పేరుతో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రకటన పట్ల అభినందనలు తెలియజేశారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాన్ని మెగాస్టార్ అందుకోనున్నారు. చిరంజీవి నటుడిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. నాలుగు దశాబ్దాల పాటు 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ఇలాంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.

Updated Date - 2022-11-21T11:48:05+05:30 IST