Draupadi Murm.. దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కూడా ఉండాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ABN , First Publish Date - 2022-12-04T13:53:24+05:30 IST
విజయవాడ: దేశ భాషలందు తెలుగు లెస్స.. ‘అందరికీ నమస్కారం, మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని తెలుగులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murm) చెప్పారు.
విజయవాడ: దేశ భాషలందు తెలుగు లెస్స.. ‘అందరికీ నమస్కారం, మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని తెలుగులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murm) చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె రాష్ట్రానికి వచ్చారు. పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రపతికి పౌర సన్మానం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. నాగార్జునుడు అమరావతిలో చేసిన బోధనలు చలా గొప్పవని, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి గతంలో ఏపీ నుంచి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారన్నారు. మన్యం వీరుడు అల్లూరిని మనం ఇప్పుడు గౌరవించుకుంటున్నామని, గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం ఇప్పటికీ అభిమానాన్ని పొందుతోందన్నారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏపీ కోడలని, సరోజినీ నాయుడు ఇక్కడి నుంచే వచ్చారని ద్రౌపదీ ముర్ము అన్నారు. సర్వేపల్లి రాధా కృష్ణ చెప్పిన వ్యాఖ్యలు ఈ సందర్బంగా రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు లాంటి మహిళలు స్వాతంత్ర్య
ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన బిర్సా ముండా వంటి వారిని ఈ తరం గుర్తు ఉంచుకోవాలన్నారు. అంతరిక్షం విఙ్ఞానంలో ఇస్రోలో తెలుగు వారి సేవలు దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు.