CM Jagan: శబరిమల బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
ABN , First Publish Date - 2022-11-19T12:40:34+05:30 IST
కేరళ రాష్ట్రం పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.
అమరావతి: కేరళ రాష్ట్రం పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy) ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని... యాత్రికులకు తగిన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి (AP CM)కి అధికారులకు నివేదించారు.
ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం 2 బస్సుల్లో 84 మంది ఈనెల 15న శబరిమల వెళ్లారని తెలిపారు. స్వామి దర్శనానంతరం తిరిగి వస్తున్న సమయంలో ఈరోజు ఉదయం బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణింస్తుండగా.. వారిలో 18 మంది గాయపడ్డారన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.