Cm jagan house: పేర్నినాని నుంచి కాపాడాలని ఓ దళిత జంట..
ABN , First Publish Date - 2022-11-25T15:23:52+05:30 IST
మాజీ మంత్రి పేర్నినాని(Ex minister Perni nani) నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత దంపతులు ముఖ్యమంత్రి జగన్ నివాసం(Cm jagan house) ఎదుట
గుంటూరు: మాజీ మంత్రి పేర్నినాని(Ex minister Perni nani) నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత దంపతులు ముఖ్యమంత్రి జగన్ నివాసం(Cm jagan house) ఎదుట నిరసనకు దిగారు. మచిలీపట్నంకు చెందిన యువతి, యువకుడు కులాంతర వివాహం చేసుకున్నారు. మాజీ మంత్రి పేర్నినాని ద్వారా తమకు ప్రాణహాని ఉందని జంట ఆరోపిస్తోంది. అయితే ఇదే విషయంపై ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma)ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా మాకు న్యాయం దక్కలేదని జంట వాపోయింది. దీంతో తాడేపల్లిలోని సీఎం ఇంటి ముందు దళిత దంపతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని సీఎం జగన్ను వేడుకుంటున్నారు.