Ramakrishna: ఆ మోసాన్ని బయటపెట్టిన ధర్మానకు అభినందనలు

ABN , First Publish Date - 2022-11-01T15:26:44+05:30 IST

ఏపీ రాజధాని (AP Capital Issue) అంశంలో వైసీపీ మోసాన్ని బయటపెట్టిన మంత్రి ధర్మానకు అభినందనలు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Ramakrishna: ఆ మోసాన్ని బయటపెట్టిన ధర్మానకు అభినందనలు

అమరావతి: ఏపీ రాజధాని (AP Capital Issue) అంశంలో వైసీపీ మోసాన్ని బయటపెట్టిన మంత్రి ధర్మాన ( Dharmana prasad rao)కు అభినందనలు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ సర్కార్ (Jagan government)మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తిందని మండిపడ్డారు. విశాఖనే ఏపీ రాజధానిగా ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు (AP Minister) స్పష్టం చేశారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy) మూడు రాజధానుల డ్రామాలు కట్టి పెట్టాలని అన్నారు. విశాఖ రాజధానిగా కోరే మంత్రులు, ముఖ్యమంత్రి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ (YCP)కి ధైర్యం ఉంటే ఏపీ రాజధాని అంశం రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని రామకృష్ణ (CPI Leader) అన్నారు.

Updated Date - 2022-11-01T15:26:46+05:30 IST