Ramakrishna: నకిలీ పత్తి విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-11-08T09:24:14+05:30 IST

నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

Ramakrishna: నకిలీ పత్తి  విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కర్నూలు: నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy)కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) లేఖ రాశారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో చాలా మంది రైతులు నష్టపోయారని తెలిపారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టినా పంట దిగుబడి రాలేదని చెప్పారు. సమగ్ర విచారణ జరిపి నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని... నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామకృష్ణ (CPI leader) డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-08T10:46:40+05:30 IST