Ramakrishna: జగన్‌కు లిక్కర్ మాఫియాతో సంబంధాలు

ABN , First Publish Date - 2022-11-11T11:21:38+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Ramakrishna: జగన్‌కు లిక్కర్ మాఫియాతో సంబంధాలు

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan mohan reddy)కు లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna)ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పోలీసులకు పట్టుబడ్డ విజయసాయిరెడ్డి (Vijayasaireddy) సమీప బంధువు శరత్ రెడ్డి నుంచి సీఎంకు ముడుపులు అందాయన్నారు. శరత్ రెడ్డి నుంచి 9వేల కోట్లు జగన్ రెడ్డి (AP CM) తీసుకున్నారని తెలిపారు. సీఐడీ (CID)కి ఇదంతా కనిపించదా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చూస్తే జగన్‌(YCP Chief)కు భయమని వ్యాఖ్యలు చేశారు. విశాఖకు వస్తున్న మోదీ (Narendra modi) సభ జయప్రదం చేసేందుకు సీఎం నానా తంటాలు పడుతున్నారని యెద్దేవా చేశారు. కేసుల నుంచి బయటపడడానికే జగన్ ప్రధానికి సాగిల పడుతున్నారన్నారు. ఏపీ(Andhrapradesh)కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిని జగన్ నిలదీయాలని తెలిపారు. విశాఖలో కార్మికులను అరెస్టు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రజాసంఘాల నేతలను గృహ నిర్బంధం చేస్తారా అంటూ రామకృ (CPI Leader) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-11T11:21:39+05:30 IST