Ramakrishna: రాప్తాడు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి
ABN , First Publish Date - 2022-11-28T09:30:13+05:30 IST
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Topudurthi Prakash Reddy), ఆయన సోదరుడులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తెలంగాణ (Telangana)కు తరలిపోయిందని మండిపడ్డారు. తోపుదుర్తి సోదరులు తమకు ఎదురొస్తే ఎవరినైనా చంపుతామనే పద్ధతుల్లో తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయినదానికి కానిదానికి కేసులు పెట్టి ప్రతిపక్షాలను వేధించే పోలీసు యంత్రాంగం తోపుదుర్తి సోదరుల విషయంలో కళ్ళు మూసుకుందా? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రత్యర్థులపై దాడిచేసే వాళ్లను పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ రామకృష్ణ (CPI Leader)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.