AP New: మంత్రి జోగి రమేష్ వేధిస్తున్నారు... దంపతుల ఆవేదన

ABN , First Publish Date - 2022-12-31T09:13:02+05:30 IST

మంత్రి జోగి రమేష్ నియోజకవర్గం లో దారుణం జరిగింది.

AP New: మంత్రి జోగి రమేష్ వేధిస్తున్నారు... దంపతుల ఆవేదన

కృష్ణా: మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh)నియోజకవర్గం లో దారుణం జరిగింది. మంత్రి, అతని అనుచరులు వేధిస్తున్నారంటూ దంపతులు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. జోగి రమేష్, ఇతర అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం‌ చేయకపోతే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ‌వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే...

బాధితుడు భాస్కరరావు మాట్లాడుతూ... ‘‘మాది పెడన మండలం ఉరిమి గ్రామం. నాలుగు వేళ్లు పోయాయి .. అయినా పెన్షన్ కి అనర్హుడిని చేశారు. నా భార్య చిన్న రాజమణిని ఆశా వర్కర్‌గా పనిచేస్తుంటే తొలగించారు. పొలంలో కోత కోస్తుంటే కోత మిషన్ కూడా లాకెళ్ళారు. నాపై దాడి చేస్తే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాను. 3 గంటలకు ఆసుపత్రిలో ఉంటే రాత్రి తొమ్మిదింటికి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. నాకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసుకున్నాను. పదిమంది పోలీసు సిబ్బంది నా ఇంటి మీద దాడి లాగా వచ్చారు. రాజీ చేసుకోవాలని బెదిరించారు... స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారు. గంటల తరబడి నిలబెట్టి పంపేవారు. నాకు భయం వేసి ఇంటికి వచ్చి గృహ నిర్బంధంలోకి వెళ్లాను. ఈ మొత్తం వ్యవహారానికి గంధం శ్రీనివాసరావు, గుండా బత్తుల రాధాకృష్ణ, మంత్రి జోగి రమేష్ కారణం. వీరందరిపైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం’’ అంటూ భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-31T09:13:03+05:30 IST