Ayyanna Arrest.. దొంగల్లా దూరి అయ్యన్నను అరెస్ట్ చేయడం దారుణం: ఎమ్మెల్యే అనగాని
ABN , First Publish Date - 2022-11-03T13:45:11+05:30 IST
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్ట్‌ను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఖండించారు.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్ట్‌ను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నను పోలీసులు దొంగల్లా దూరి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పిట్టగోడ విషయంలో అమానుషంగా వ్యవహరించడం కక్షసాధింపు చర్యేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నేతలను అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి అరెస్ట్‌లు చేయడం జగన్ రెడ్డి తుగ్లక్ పరిపాలనకు అద్దంపడుతోందన్నారు. సీఐడీ పోలీసులు జగన్ రెడ్డి తొత్తులా వ్యవహరిస్తూ టీడీపీ బీసీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనగాని సత్య ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.