MP Raghurama: జంధ్యాల సభలా కర్నూలు సభ
ABN , First Publish Date - 2022-12-05T12:54:58+05:30 IST
నంద్యాలలో నిర్వహించిన రాయలసీమ గర్జనపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు.
న్యూఢిల్లీ: నంద్యాలలో నిర్వహించిన రాయలసీమ గర్జనపై ఎంపీ రఘురామకృష్ణం రాజు (Narsapuram MP Raghurama krishnam raju) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలులో సభ జంధ్యాల సభ లాగా ఉందని యెద్దేవా చేశారు. గర్జనకు రాయలసీమ ప్రజలు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. రాయలసీమ జనాల చెవిలో పూలు ఎలా పెట్టాలని అనుకున్నారని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందం అని అందరు అంటున్నారు.... అసెంబ్లీలో జగన్ శ్రీ బాగ్ ఒప్పందంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గుంటూరులో కోర్టు, రాయలసీమలో రాజధాని పెట్టాలని నాడు అనుకున్నారని... ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. 2014లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే జగన్ అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. రాయలసీమ గర్జనకు స్కూల్స్ మూసివేసి.. విద్యార్థులను తీసుకొచ్చారని మండిపడ్డారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని, టెంకాయ కొడతానని జగన్ గతంలో అన్నారని... కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదని వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజలు రాజధాని కావాలని అనుకుంటారు కానీ హైకోర్టు అడుగుతారా అని రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.