AP News: సీఎం జగన్కు జనం గోడు వినే తీరిక లేదా?: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-11-02T16:11:48+05:30 IST
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనం గోడు వినే తీరిక లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనం గోడు వినే తీరిక లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎంకు ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి విన్నవించే అవకాశం లేక క్యాంప్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, ముళ్ళకంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అఖిలపక్ష సమావేశాలు లేవని, కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో నియంత పాలన సాగుతోందని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.