Varla Ramaiah: చిత్తూరు ఎస్పీపై డీజీపీకి వర్ల లేఖ

ABN , First Publish Date - 2022-11-25T09:26:43+05:30 IST

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు.

Varla Ramaiah: చిత్తూరు ఎస్పీపై డీజీపీకి వర్ల లేఖ

అమరావతి: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి (Rishanth Reddy) అధికార దుర్వినియోగంపై డీజీపీ(AP DGP)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, కస్టోడియల్ టార్చర్ రిషాంత్(Chittor SP) అలవాటుగా మార్చుకున్నారన్నారు. నర్సీపట్నంలో విధులు నిర్వహించే సమయంలో టీడీపీ కార్యకర్త యేలేటి సంతోష్‌ను టార్చర్ చేయడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. సంతోష్‌కు పరిహారం ఇవ్వాలన్న ఎన్‌హెచ్‌ఆర్సీ ఉత్తర్వులను కూడా ఎస్పీ పెడచెవిన పెట్టారన్నారు. పోలీసులు న్యాయం చేయలేదని సంతోష్ కోర్టుకెళ్లగా, న్యాయస్థానం ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారని ఆయన మండిపడ్డారు.

ఈ క్రమంలో డిసెంబర్ 5 చీఫ్ సెక్రటరీ హాజరుకావాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలకు భయపడి నిన్న హడావిడిగా బాధితుడికి పరిహారం ఇస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. టీడీపీ కేడర్‌ను అణచివేతే అజెండాగా ఎస్పీ రిషాంత్ రెడ్డి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ కేడర్‌ను ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారు. రిషాంత్ రెడ్డి ఎస్పీ పదవికి తగడన్నారు. రిషాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రిశాంత్ రెడ్డితో సహా తప్పుడు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని వర్లరామయ్య (TDP Leader) లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-25T09:26:44+05:30 IST