Varla Ramaiah: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
ABN , First Publish Date - 2022-11-30T09:36:08+05:30 IST
రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.
అమరావతి: రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి (Topudurti Chandrashekar reddy) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ(Additional DGP of Intelligence)కి టీడీపీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah letter to Additional DGP of Intelligence) లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu), లోకేష్ (Nara Lokesh)పై అత్యంతనీచంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు, లోకేష్‌ల భద్రతకు సంబంధించి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్‌పై దాడి చేసేందుకు సంఘ వ్యతిరేకులతో వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని... అందులో బాగంగానే బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేష్‌కు తక్షణమే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పట్లు చేయాలన్నారు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి విశృంఖలమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు.