Somireddy: వైసీపీ అక్రమాలు, అవినీతిపై సోమిరెడ్డి మండిపాటు..
ABN , First Publish Date - 2022-12-01T14:28:41+05:30 IST
నెల్లూరు: వైసీపీ (YCP) అక్రమాలు, అవినీతిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) మండిపడ్డారు.
నెల్లూరు: వైసీపీ (YCP) అక్రమాలు, అవినీతిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు, కుంభకోణాలు వారానికి రెండు బయటికి తీస్తామన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) మంత్రి అయిన తరువాత దేవాలయాల భూములను కూడా వదలడం లేదన్నారు. భూములు ఆక్రమించుకుంటున్న కాకాని అనుచరులు ఇసుక డంపింగ్ యార్డ్ లకు బాడుగులకిచ్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవి అడ్డం పెట్టుకొని కాకాణి అనుచరులు రెచ్చి పోతున్నారన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని, ప్రజల, దేవాలయాల ఆస్తులను ఐఏఎస్ అధికారులు కాపాడాలన్నారు. వైసీపీ నేతల అవినీతిని ఎండగట్టెందుకు అవసరమైతే రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు కూడా నెల్లూరు జిల్లాకు వస్తారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.