AP Minister: పవన్‌కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదు
ABN , First Publish Date - 2022-11-16T12:36:25+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
ప్రకాశం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan)కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ (CM Jagan) ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ (Janasena Chief) తెలుసుకోవాలన్నారు. తెలంగాణా వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. మోదీనా.. అమిత్ షానా తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అభివద్ది, సంక్షేమ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. 2024లో జగనా.. చంద్రబాబా (Chandrababu) తేలుతుందని మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) పేర్కొన్నారు.