Prakasam District: మంత్రి సురేష్‌కు మాతృవియోగం

ABN , First Publish Date - 2022-12-26T19:53:23+05:30 IST

మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Audimulapu Suresh) తల్లి చెరుకూరి థెరిసమ్మ మృతిచెందారు. కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్సపొందుతున్నారు.

Prakasam District: మంత్రి సురేష్‌కు మాతృవియోగం

మార్కాపురం: మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Audimulapu Suresh) తల్లి చెరుకూరి థెరిసమ్మ మృతిచెందారు. కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్సపొందుతూ... ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా (Prakasam District) మార్కాపురంలోని జార్జి గెస్ట్‌హౌస్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ప్రజల సందర్శనార్ధం ఉంచారు. అనంతరం పట్టణంలో ప్రదర్శనగా జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలకు తరలించి అక్కడ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం భూస్థాపన కార్యక్రమం పూర్తిచేశారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, హోంమంత్రి సుచరిత, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలు మంత్రి సురేష్‌ను ఫోన్‌లో పరామర్శించారు. థెరిసమ్మ మృతదేహానికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు నివాళులర్పించి మంత్రి సురేష్‌ను ఓదార్చారు.

Updated Date - 2022-12-26T19:53:40+05:30 IST