Minister Bosta: బీసీ గర్జనతో పాటు ఎస్సీ, ఎస్టీ కుల గర్జనలు నిర్వహిస్తాం

ABN , First Publish Date - 2022-12-02T20:15:15+05:30 IST

Vizianagaram: రానున్న రోజుల్లో బీసీ గర్జనతో పాటు ఎస్సీ, ఎస్టీ గర్జనలు కూడా నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చంద్రబాబు పర్యటనలనుద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. కుల

Minister Bosta: బీసీ గర్జనతో పాటు ఎస్సీ, ఎస్టీ కుల గర్జనలు నిర్వహిస్తాం

Vizianagaram: రానున్న రోజుల్లో బీసీ గర్జనతో పాటు ఎస్సీ, ఎస్టీ గర్జనలు కూడా నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చంద్రబాబు పర్యటనలనుద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. కుల వృత్తులు నమ్ముకున్న వారు అదే కులంలో ఉండాలన్నది టీడీపీ(TDP) విధానమని, అయితే అన్ని కులాల వారు చదువుతో అభ్యున్నతి సాధించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా.. జనం ఆయన్ను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. బీసీల కోసం రూ. 80 వేల కోట్లు కేటాయించామని చెబుతూనే.. తూర్పు కాపులను బీసీ ఏలో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని బొత్స తెలిపారు.

Updated Date - 2022-12-02T20:15:16+05:30 IST