TDP: టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరిన సత్తెనపల్లి పంచాయతీ
ABN , First Publish Date - 2022-12-01T18:06:40+05:30 IST
సత్తెనపల్లి (Sattenapally) పంచాయతీ టీడీపీ (TDP) రాష్ట్ర కార్యాలయానికి చేరింది.
అమరావతి: సత్తెనపల్లి (Sattenapally) పంచాయతీ టీడీపీ (TDP) రాష్ట్ర కార్యాలయానికి చేరింది. సత్తెనపల్లి నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షుల నియామకంపై విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో పని చేసే వారికి అవకాశం ఇవ్వలేదంటూ కోడెల శివరామ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి కోడెల శివరాం, అతని అనుచరులు వచ్చారు. ఈ విషయంపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.