AP News: టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కారిస్తాం: బొరగం శ్రీనివాసులు
ABN , First Publish Date - 2022-12-04T16:28:27+05:30 IST
జంగారెడ్డి గూడెం (ఏలూరు జిల్లా): టీడీపీ అధికారంలోకి రాగానే ఆరు మాసాలలోపు సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో
జంగారెడ్డి గూడెం (ఏలూరు జిల్లా): టీడీపీ అధికారంలోకి రాగానే ఆరు మాసాలలోపు సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలై అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. గిరిజనులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంతో వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
బుట్టాయగూడెం మండలం కామయ్యకుంట పంచాయతీ పరిధిలోని కుర్సకన్నప్పగూడెం, పండుగూడెం, బండర్లగూడెం, కామయ్యకుంట గ్రామాలకు చెందిన పలువురు వివిధ పార్టీల నుంచి టీడీపీలో చేరారు. వీరికి బొరగం శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. జగన్ పాలనా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ జనంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
టీడీపీలో చేరిన వారిలో కుంజా వీరాస్వామి, కోటం నాగ దుర్గారావు, కలుం నాగరాజు, కుర్సం గంగరాజు, బక్క వెంకటస్వామి, కారం కృష్ణ, పెడకం పాపారావు, తెల్లం కన్నయ్య, సున్నం సూరిబాబు, పొట్టం రమేష్, పోట్టం నరేష్, కుంజం రాము, సున్నం వెంకటేశ్వరరావు, పెడకం సింగరాజు, మొట్టం ప్రదీప్, నాగరాజు, పెడకం కన్నపరాజు, పెడకం రాధాకుమారి, మొట్టం రజిత, పూనెం విరాయమ్మ, మొట్టం వీరమ్మ, పైదా బాపిరాజు, తెల్లం దేవరాజు, పొట్టం కన్నపరాజు, మడకం కృష్ణ, పైదా వెంకటలక్ష్మీ, పొట్టోడి సూరమ్మ, తెల్లం సురేష్, మొడియం ముక్కయ్య, పాయం దిలీప్, గారపాటి వెంకటేష్, మొట్టం నాగరాజు, మడివి దేవరాజు, మొడియం బాబురావు, బుద్దుల సాయి, కొమరం పెంటయ్య, కొమరం కన్నయ్య, కొమరం బుచ్చిరాజు, మడకం బొర్రయ్య, కారం సత్తిబాబు, కుంజం గంగరాజు, తెల్లం గంగరాజు, మొట్టం గంగాభవాని, మొట్టం వెంకటేష్ ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకుడు సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు తెల్లం వెంకటేశ్వరరావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుర్సం వెంకటేశ్వరరావు, బీజీ సెల్ మండల అధ్యక్షుడు దెయ్యాల కృష్ణమోహన్, రాష్ట్ర ఎస్సీ సెల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.