Ap news: కొడాలి నానికి నోటీసు ఇవ్వాలి: అనిత
ABN , First Publish Date - 2022-10-25T17:41:21+05:30 IST
కో సీఎం చేతగానితనం, అసమర్థత ఆడబిడ్డలకు శాపంగా మారిందని టీడీపీ నేత వంగలపూడి అనిత (vangalapudi anitha) అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో కడపలో అనూష చనిపోయిందని, పోస్ట్మార్టం నివేదిక రాకుండానే ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు? ఆమె ప్రశ్నించారు.
అమరావతి: సైకో సీఎం చేతగానితనం, అసమర్థత ఆడబిడ్డలకు శాపంగా మారిందని టీడీపీ నేత వంగలపూడి అనిత (vangalapudi anitha) అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో కడపలో అనూష చనిపోయిందని, పోస్ట్మార్టం నివేదిక రాకుండానే ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు? ఆమె ప్రశ్నించారు. హోం మంత్రి ఏది పడితే అది మాట్లాడుతోందన్నారు. మహిళాకమిషనే ఏపీ మహిళల పరువుతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినోలు నిర్వహించి, ఆడబిడ్డలతో అర్థనగ్న ప్రదర్శనలు ఇప్పించిన మాజీ మంత్రి కొడాలి నానికి (kodali nani) నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.