Ayyannapatrudu: మూడు రాజధానుల ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా...

ABN , First Publish Date - 2022-11-30T14:26:04+05:30 IST

మూడు రాజధానుల ప్రసక్తే లేదని, రాజధాని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని ఎప్పుడో తాను చెప్పానని...

Ayyannapatrudu: మూడు రాజధానుల ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా...

విశాఖపట్నం: మూడు రాజధానుల ప్రసక్తే లేదని, రాజధాని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని ఎప్పుడో తాను చెప్పానని... సుప్రీం తీర్పుతో అది రుజువైందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ( TDP Leader Ayyanna patrudu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... శాసనసభలో ఒకటే రాజధానిపై ఏకగ్రీవ తీర్మానం చేశామని... అప్పుడు జగన్ (A) CM YS Jagan Mohan Reddy) కూడా ఓటు వేశారని గుర్తుచేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే.. మూడు రాజధానులు తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో పాస్ అయిన బిల్లును మార్చే అధికారం సీఎంకి గానీ, అసెంబ్లీకి గానీ లేదన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ముంబాయి తరహాలో విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూములు లాకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Updated Date - 2022-11-30T14:27:40+05:30 IST