బాలల హక్కులను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-11-15T00:19:23+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తిం చాలని ఐసీడీఎస్‌ పీడీ శాంతకుమారి అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్స వాలను జిల్లా ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాల యంలో నిర్వహించారు.

బాలల హక్కులను పరిరక్షించాలి

విజయనగరం దాసన్నపేట: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తిం చాలని ఐసీడీఎస్‌ పీడీ శాంతకుమారి అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్స వాలను జిల్లా ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాల యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతకుమారి చేతుల మీదుగా ‘సమా నత్వం, సమ్మిళితం-బాలలు అందరికీ అందిద్దాం’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పం దం లో భారతదేశం సంతకం చేసి సభ్యదేశాలుగా కొనసాగుతున్న తరుణంలో బాల ల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుం టున్నా యన్నారు. బాలలే మన దేశ భవిష్యత్తన్నారు. ఫోరం చైర్మన్‌ చిట్టిబాబు మాటా ్లడుతూ, బాలల హక్కులపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు, బాల్య వివాహాల నిర్మూలన, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, బాలలకు భద్రత కల్పించాలన్నారు. ఏ.నాయుడు, కె.వరలక్ష్మి, శివప్రసాద్‌, భానుమూర్తి, విద్యాసాగర్‌, ఖాళీబాబు, వెంకట లక్ష్మీ, సత్యవాణి పాల్గొన్నారు.

ఫ బాలల హక్కులను కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ కేసలి అప్పారావు అన్నారు. జాతీయ బా లల హక్కుల దినోత్సవం సందర్భంగా ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలలు ఉన్నత లక్ష్యంతో కూ డిన ప్రణాళికలు రూపొందించుకుని సెల్‌ఫోన్‌లు, టీవీ, ఎలాక్టాృనిక్స్‌ గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలన్నారు. శ్రద్దగా చదువుకుని దేశానికి , సమాజానికి ఉపయోగ పడేలా ఉన్నత శిఖారాలను అదిరోహించలన్నారు. డిప్యూటీ మేయర్‌ శ్రావ ణి, సి.ఐ వెంకటరావు, ఐసీడిఎస్‌ పీడి శాంతకుమారి, లక్షణరావు, అచ్చిరెడ్డి, ఎ.నా యుడుతో పాటు ఒన్‌ స్టాప్‌ సెంటర్‌ మేనేజర్‌, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

1111111111111111111

Updated Date - 2022-11-15T00:19:25+05:30 IST