మా జీతాలు చెల్లించండి

ABN , First Publish Date - 2022-11-06T04:43:18+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతం పడుతుందని ఓ భరోసా. అంతకుముందు అలాగే పడేది కూడా! కానీ..

మా జీతాలు చెల్లించండి

ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతం పడుతుందని ఓ భరోసా. అంతకుముందు అలాగే పడేది కూడా! కానీ... ఇప్పుడా నమ్మకానికి బీటలు పడ్డాయి. ఎప్పుడొస్తుందో తెలియని జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా చూడాల్సి వస్తోంది. రోజూ జీతం పడిందేమో అన్న ఆశతో ఫోన్‌లో మెసేజ్‌లు చెక్‌ చేసుకుంటున్న పరిస్థితి. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలు కట్టలేక వాటికి జరిమానాలు, అధిక వడ్డీలు కడుతున్న దుస్థితి. దీంతో ఉపాధ్యాయులు ‘మా జీతం మాకివ్వండి’ అంటూ నిరసనకు దిగారు. ‘ఒకటో తేదీ పోయింది. ఐదో తేదీ కూడా వచ్చింది. ఇంకా మాకు జీతాలు వేయలేదు. ప్రభుత్వం వెంటనే మాకు జీతాలు ఇవ్వాలి’ అని విజయనగరం జిల్లా జామి ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. శనివారం భోజన విరామ సమయంలో ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. జీతాల చెల్లింపు ప్రతినెలా జాప్యం అవుతుండడంతో ఒకటి నుంచి పదిలోపు చెల్లించాల్సిన హౌసింగ్‌, ఎడ్యుకేషన్‌, పర్సనల్‌ లోన్‌ల కంతులు కట్టలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- జామి

Updated Date - 2022-11-06T04:43:19+05:30 IST