Dwaraka Tirumal: చిన వెంకన్న దేవస్థానానికి అరుదైన ఘనత
ABN , First Publish Date - 2022-11-19T13:00:17+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న దేవస్థానానికి అరుదైన ఘనత లభించింది.
ఏలూరు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న దేవస్థానానికి అరుదైన ఘనత లభించింది. దేవస్థానానికి సంబంధించిన ఏడు విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందారు. వరుసగా నాలుగో సంవత్సరం చిన వెంకన్న దేవస్థానం ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందుకుంది. భారతదేశంలో వరుసగా నాలుగు సార్లు ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందుకున్న ఏకైక దేవస్థానంగా ద్వారకాతిరుమల. ఐఎస్ఓ సర్టిఫికెట్లను ఆలయ చైర్మన్ ఎస్. వి సుధాకర్ రావుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శివయ్య అందజేశారు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టం, ఎన్విరాన్మెంట్ సిస్టం, హెల్త్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి.