Chandrababu: చంద్రబాబు పోలవరం పర్యటనలో హైటెన్షన్
ABN , First Publish Date - 2022-12-01T18:20:02+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పోలవరం పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
పోలవరం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పోలవరం పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. పోలవరం (Polavaram)లో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. పోలవరం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఆంక్షల వలయంలో పోలవరం పరిసరాలున్నాయి. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు.
ఈ సందర్బంగా ప్రభుత్వం, పోలీసుల తీరును చంద్రబాబు ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు ఏ కారణాలతో తనను అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. విభజన సమయంలోనే పోలవరం కోసం పట్టుబట్టానని తెలిపారు. జగన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలోనే పోలవరాన్ని 75 శాతం పూర్తిచేశామని, ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయట్లేదని తప్పుబట్టారు. టీడీపీని విమర్శించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు.