Janasena: వివాదాలు ఉన్న భూములను పేదలకు కేటాయించడం వైసీపీ నేతలకే చెల్లింది
ABN , First Publish Date - 2022-11-12T19:30:05+05:30 IST
జీలుగుమిల్లి జనసేన (Janasena) మండల కమిటీ ఆధ్వర్యంలో ''జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు'' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం శనివారం పి. రాజవరంలో నిర్వహించారు.
జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా): జీలుగుమిల్లి జనసేన (Janasena) మండల కమిటీ ఆధ్వర్యంలో ''జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు'' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం శనివారం పి. రాజవరంలో నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు పేదలకు కేటాయించిన జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి వివాదాలు ఉన్న భూములను పేదలకు కేటాయించడంలో జగనన్న వైసీపీ (YCP) నాయకులకే చెల్లిందని ఆయన విమర్శించారు.
పేద ప్రజలకు ఇళ్లు నిర్మించడంలో నాయకులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, మండల కార్యదర్శి సిరి శ్రీను. కొయ్యలగూడెం జనసేన మండల అధ్యక్షులు తోట రవి, జనసేన సీనియర్ నాయకులు సిహెచ్ సుబ్రమణ్యం, వీరంకి వెంకటేశ్వరరావు, రూప సత్యనారాయణ, కోల మధు, పేరా బత్తుల రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.