Tellam Balaraju: వంకవారిగూడెం పరిధిలో గడప గడపకు పోలవరం ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-12-08T14:45:08+05:30 IST

జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది.

Tellam Balaraju: వంకవారిగూడెం పరిధిలో గడప గడపకు పోలవరం ఎమ్మెల్యే

ఏలూరు: జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Polavaram MLA Tellam Balaraju) గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పరిధిలో రమణక్క పేట, మడకం వారి గూడెం, చీమల వారి గూడెం గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పథకాల లబ్ధిని తెలియజేశారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. అలాగే తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-12-08T14:45:09+05:30 IST