Maganti Babu: టీడీపీ కార్యకర్తలకు ప్లాస్క్‌లు అందించిన మాగంటి

ABN , First Publish Date - 2022-11-30T10:03:27+05:30 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ మాగంటి బాబు

Maganti Babu: టీడీపీ కార్యకర్తలకు ప్లాస్క్‌లు అందించిన మాగంటి

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP National President Nara Chandrababu Naidu) పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ మాగంటి బాబు (Former MP Maganti babu) ముందస్తుగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు కార్యకర్తలతో ముచ్చటించి వారికి 5000 ప్లాస్క్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పార్టీ స్థానిక నాయకులు పరిమి రాంబాబు, ఆలపాటి రాము, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజి, కొమ్మిరెడ్డి సోమరాజు, ఎన్ని రాంబాబు, పాకనాటి శ్రీను, మోహనసాయి, భాస్కరరావు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T10:03:29+05:30 IST