YCP MINISTER: అందరికీ బదులిస్తానంటాడు.. అధికారం కోసమే పవన్ పార్టీ పెట్టాడా?
ABN , First Publish Date - 2022-11-29T20:42:49+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ (YCP) మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ (YCP) మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పవన్ ఎవరికోసం పనిచేస్తున్నాడు? అని మంత్రి కొట్టు ప్రశ్నించారు. సినిమా డైలాగులు ప్రజల్లో మాట్లాడవద్దని, ఇప్పటంలో రోడ్ల విస్తరణపై కోర్టు తీర్పును పవన్ తప్పుపడుతున్నారని మంత్రి అన్నారు. పవన్ వల్ల వారు కోర్టుతో మొట్టికాయలు వేయించుకుని జరిమానా కట్టారని మంత్రి గుర్తు చేశారు. అధికారం వచ్చాక అందరికీ బదులిస్తానంటాడు.. అని, అధికారం కోసమే పవన్ పార్టీ పెట్టాడా? అని కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ప్రశ్నించారు.