Principal Harassment: ఛీ.. ఇదేం పని..!
ABN , First Publish Date - 2022-11-04T12:17:15+05:30 IST
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్‌వైజింగ్ కమిటీ (డీఎంఎస్‌సీ) నిర్వహించిన తనిఖీల్లో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ కళాశాల ప్రిన్సిపాల్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు
ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు
మరో కళాశాలలో అధ్యాపకుల దురుసు వ్యవహారశైలి
పలువురికి షోకాజ్ నోటీసులు..
డీఎంఎస్‌సీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి ఎన్నో ఘటనలు
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్‌వైజింగ్ కమిటీ (డీఎంఎస్‌సీ) నిర్వహించిన తనిఖీల్లో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ కళాశాల ప్రిన్సిపాల్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కొందరు విద్యార్థినులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరో కళాశాలలో అధ్యాపకులు బాలికల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్టు సాక్షాత్తూ కమిటీ ఎదుటే తమ వేదనను వెళ్ళగక్కడం కలకలం రేపుతోంది.
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 3 : అన్ని జిల్లాల్లోని జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు, విద్యార్థుల సమస్యలు, నిర్ణీత ఫీజుల అమలు తదితర అంశాలను నిరంతరం పర్య వేక్షించేందుకు ఈ ఏడాది నుంచి డీఎంఎస్‌సీలను సంబంధిత జిల్లా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) కన్వీనర్‌గా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సైకియాట్రిస్టు, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఎస్పీ తరఫున మహిళా ఎస్‌ఐ, జిల్లా విద్యా శాఖ తరఫున నియమితులైన అధికారి, ఐసీడీ ఎస్ పీడీ, డీఎంహెచ్‌వోలు సభ్యులుగా ఉంటా రు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో టాయి లెట్లు నిర్వహణ, తాగునీటి సదుపాయం, ఫర్నీచర్ తదితర సౌకర్యాలతోపాటు, తర గతు ల నిర్వహణ, ఒత్తిడి లేని బోదన, అదనపు తరగతుల పేరిట విద్యార్థులపై ఒత్తిళ్ళు తెస్తున్నారా? వంటి అంశాలు, ఇంకా కళాశాల లో ఏవైనా వేధింపులకు గురిచేస్తున్నారా? అవాంఛనీయ పరిణామాలు, ప్రవర్తన వంటి విషయాలను నేరుగా విద్యార్థులనే అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తదుపరి చర్యలు చేపట్టడం కమిటీ విధుల్లో కొన్ని ముఖ్య మైనవి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లాలో కమిటీ సందర్శించిన కళాశాలల్లో కొన్నిచోట్ల అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిగతా సౌకర్యాల విషయంలో ఎలా వున్నా.. ఓ కళాశాల ప్రిన్సిపాల్ అక్కడ చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్టు కమిటీ దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన కమిటీ సంబంధిత ప్రిన్సిపాల్‌ను తీవ్రంగా మందలించడంతో పాటు, వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఓ తండ్రిలా భావించానే తప్ప విద్యార్థినులపై తనకు ఎటువంటి దురుద్దేశమూ లేదని వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. ]
అయితే ఈ విషయం బయటకు వస్తే కళాశాల పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని భయాందోళనలతో తాను ఇక మీదట సంబంధిత ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ఉన్న తరగతి వైపు వెళ్ళబోనని తనిఖీ అధికారుల వద్ద ప్రిన్సిపాల్ వేడుకున్నట్టు తెలిసింది. దీంతో విషయాన్ని బయటకు పొక్కనీయకుండా తాము సాధారణ తనిఖీలు చేసినట్టుగా మాత్రమే పత్రికలకు ఓ ప్రకటన రూపంలో సమాచార మిచ్చి ప్రిన్సిపాల్ అసభ్యకర ప్రవర్తనను గాని, విద్యార్థినులవేదన/ ఫిర్యాదునుగాని వెలుగులోకిరాకుండా జాగ్రత్తపడినట్టు చెబుతున్నా రు. అయితే ప్రిన్సిపాల్‌ను వివరణ అడిగినపుడు కమిటీలోని నిర్ణీత 9 మంది అధికారులు /సభ్యులు పూర్తిస్థాయిలో అక్కడలేకపోవడం వల్ల ఈ విషయం వెంటనే బహిర్గతమయ్యేందుకు అవకాశం చిక్కలేదు. మరో కళాశాలలో అధ్యాపక సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.