Home » Collages
వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది.
వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు.
మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొత్తగా 13 నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్,
ఫీజు రీ-యింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండుకొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు.
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) వెల్లడించింది.
తెలంగాణ మెడికల్ కాలేజెస్ రూల్స్- 2021లోని రూల్ 8 (1) (2)ల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.