Byjus: బైజూస్‌‌కు అంత సీనుందా?

ABN , First Publish Date - 2022-10-31T11:33:09+05:30 IST

బైజూస్‌ కంటెంట్‌ అద్భుతంగా ఉంది. పాఠశాల విద్య కరికులమ్‌తో బైజూస్‌ కంటెంట్‌ను ఇంటిగ్రేట్‌ చేయండి. 4నుంచి 10వ తరగ తి సిలబ్‌సలో దాన్ని చేర్చండి. 5లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లు ఇవ్వబోతున్నాం. త్వరలో

Byjus: బైజూస్‌‌కు అంత సీనుందా?
అంత సీనుందా?

ఆ కంపెనీకి ఆదాయం తక్కువ.. అప్పులెక్కువ

ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో బైజూస్‌ సంస్థ

ఉద్యోగాల్లో కోతలు.. కేరళ, కర్ణాటకల్లో వివాదాలు

రాష్ట్రంలో పట్టం కడుతున్న జగన్‌ సర్కారు

పాఠ్య ప్రణాళికలోనే వేలుపెట్టే ప్రయత్నం

రూ.500 కోట్లతో ట్యాబ్‌ల కొనుగోలుకు టెండర్లు

వివాదాల కంపెనీ విద్యార్థులకు ఏం నేర్పుతుంది?

సర్కారు తీరుపై సర్వత్రా అనుమానాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘బైజూస్‌ కంటెంట్‌ అద్భుతంగా ఉంది. పాఠశాల విద్య కరికులమ్‌తో బైజూస్‌ కంటెంట్‌ను ఇంటిగ్రేట్‌ చేయండి. 4నుంచి 10వ తరగ తి సిలబ్‌సలో దాన్ని చేర్చండి. 5లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లు ఇవ్వబోతున్నాం. త్వరలో పాఠశాలల్లో డిజిటల్‌ బోర్డులు, టీవీలు ఏర్పాటు చేసి కంటెంట్‌ను అందిస్తాం....’’ అని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించింది. సీబీఎ్‌సఈ, స్టేట్‌ సిలబస్‌ కలిపి కంటెంట్‌ రూపొందించి ట్యూషన్ల వ్యాపారం చేసుకునే బైజూస్‌ కంటెంట్‌ గొప్పదని సర్కారు భావిస్తోంది. నిపుణులు, నిష్ణాతులు, అనుభవజ్ఞులయిన ప్రభుత్వ ఉపాధ్యాయులను పక్కనపెట్టి ఆ కంపెనీ వెంటపడటం వెనుక ఉన్న మర్మమేంటి? సర్కారు ప్రయత్నం పేద విద్యార్థుల ప్రయోజనాల కోసమా? లేక తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన బైజూ్‌సను గ ట్టెక్కించేందుకా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ ట్యూషన్లు, కోచింగ్‌ పాఠాలు చెప్పే బైజూస్‌ సంస్థ 16నెలల సుదీర్ఘ ఆలస్యం తర్వాత తన 2020-21 ఆర్థిక సంవత్సరం ఆడిట్‌ రిపోర్టును ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. ఈ నివేదిక ఇవ్వడంలో బైజూస్‌ జాప్యం చేస్తోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ ఆడిట్‌ రిపోర్టును కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు సమర్పించింది. దాని ప్రకారం ఆ కంపెనీ ఆదాయం రూ.2,248 కోట్లు ఉండగా నష్టం మాత్రం ఏకంగా రూ.4,500 కోట్లు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2020-21లో సంస్థకు వచ్చిన ఆదాయం రూ.2,428 కోట్లు కాగా, 2019-20లో రూ.2,704 కోట్లు వచ్చింది. అంటే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయం 14శాతం తగ్గింది. అలాగే 2019-20లో కంపెనీకి వచ్చిన నష్టాలు రూ.260 కోట్లు ఉంటే, ఏడాది తిరిగేలోగా అదికాస్తా రూ.4,500 కోట్లకు చేరడం గమనార్హం.

ఉద్యోగులు ఇంటికి

దేశవ్యాప్తంగా బైజూస్‌ కంపెనీకి 200 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో బెంగళూరు ప్రధాన కేంద్రం. నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కంపెనీ ఉద్యోగుల కోతకు దిగింది. ఒకవైపు ఎడ్‌టెక్‌ కంపెనీల విలీన ప్రక్రియ చేపడుతూనే ఆయా కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తోంది. కేరళలోని తిరువనంతపురంలోని థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బైజూస్‌ మాతృసంస్థ)లోని 170మంది ఉద్యోగులను రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చిందంటూ వారంతా ఆందోళనకు దిగారు. కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. బైజూస్‌ తీరుపై విచారణ చేయిస్తామని, ఉద్యోగులకు అండగా ఉంటామని కార్మిక మంత్రి ప్రకటించారు. దీంతో ఉద్యోగులను మరోచోట సర్దుబాటు చేస్తామని, అందుకే వారి సమ్మతి కోరామని ఆ సంస్థ కొత్త రాగం అందుకుంది. ఇప్పుడు బెంగళూరు కార్యాలయంలో ఉద్యోగులు కూడా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా రచ్చ మొదలైంది. ఇదే విషయమై కర్ణాటక రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బలవంతపు రాజీనామాలకు ఒత్తిడి తీసుకొస్తున్నారని కేఐటీయూ కార్యదర్శి సూరజ్‌ నిదియాంగ ఆరోపించారు. అలాగే విలీన సంస్థ అయిన వైట్‌హ్యాట్‌ జూనియర్‌లో ఇప్పటికే 800 మంది ఉద్యోగులను తొలగించారు. నష్టాల నివారణకు 2,500 ఉద్యోగాలను కోతపెట్టాలని సంస్థ భావిస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవాలు ఇంత ఆందోళనకరంగా ఉంటే, తమ వ్యాపారం భారీగా పెరిగిపోతోందని, మరో 10వేల మంది టీచర్లను తీసుకుంటామని బైజూస్‌ ఎండీ రవీంద్రన్‌ చెబుతున్నారు. వ్యాపారం పెరిగితే ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు, బలవంతపు రాజీనామాలెందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సర్కారుతో ఒప్పందంతో బైజూ‌స్‌కే మేలు

బైజూస్‌ తన ఆడిట్‌ రిపోర్టును సెప్టెంబరులో కేంద్రానికి ఇచ్చేలోపే కంటెంట్‌ షేరింగ్‌పై ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకుంది. ఈ తతంగం మొత్తం పూర్తయ్యాక నింపాదిగా రూ.4500కోట్ల నష్టాల చిట్టా విప్పింది. గత మేలో ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలిశారు. జూన్‌లో బిజినెస్‌ డీల్‌ కుదిరింది. రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులు 4.85లక్షల మందికి బైజూస్‌ కంటెంట్‌ ప్రీలోడ్‌ చేసిన ట్యాబ్‌లు అందించాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ట్యాబ్‌లు కొనడానికి రూ.500 కోట్ల వ్యయం కానుంది. ఈ ట్యాబుల కోసమే 500కోట్లు వ్యయం చేస్తే, రానున్న సంవత్సరాల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 26లక్షల మంది విద్యార్థులకు అవి ఇవ్వాలనుకుంటే అయ్యే ఖర్చు కనీసం నాలుగైదు వేల కోట్లకు పైగానే ఉంటుంది. ఇక ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బైజూస్‌ కంటెంట్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌లో బోధించడానికి అయ్యే వ్యయం కనీసం 1,500 కోట్లపైనే ఉంటుందని అంచనా. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి 4- 10వ తరగతి వరకు బైజూస్‌ కంటెంట్‌ను సిలబ్‌సతో ఇంటిగ్రేట్‌ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ ఒప్పందం పూర్తి వివరాలు త్వరలో బయటకు రావచ్చు. ఈ డీల్‌తో సర్కారు చెబుతోన్న మేలు విద్యార్థుల కన్నా బైజూ్‌సకే ఎక్కువని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నష్టాల్లో ఉన్న బైజూ్‌సకు లిఫ్ట్‌ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తున్నామని ఏపీ సర్కారు బహిరంగంగా చెప్పలేదు కాబట్టి, వారివద్ద ఉన్న కంటెంట్‌ను పేద విద్యార్థుల ప్రతిభకు ముడిపెట్టినట్లుగా ఉంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ వ్యాపార ఒప్పందాలు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు’’ అని విద్యారంగ నిపుణుడు అశోక్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-10-31T11:41:00+05:30 IST