Aadhaar : ఆధార్‌ తీసుకుని పదేళ్లు దాటిందా..? అప్‌డేట్‌ చేయండి

ABN , First Publish Date - 2022-11-11T03:37:09+05:30 IST

మీరు ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరునామా, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేయలేదా?

Aadhaar : ఆధార్‌ తీసుకుని పదేళ్లు దాటిందా..? అప్‌డేట్‌ చేయండి

నిబంధనలను సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ, నవంబరు 10: మీరు ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరునామా, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేయలేదా? అయితే.. మీరు వెంటనే ఆయా ఆధారాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. ఆధార్‌ తీసుకున్న తేదీ నుంచి పదేళ్లు దాటితే.. ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా ఉన్న ఫొటో గుర్తింపు కార్డులను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. పౌరులు ఈ ప్రక్రియను నేరుగా ఆధార్‌ పోర్టల్‌ లేదా ‘మై ఆధార్‌’ యాప్‌లో పూర్తిచేయవచ్చని కేంద్రం సూచించింది. ఈ సేవలు అందుబాటులో లేనివారు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను సందర్శించి, డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది. దీని వల్ల ‘నిరంతర కచ్చితత్వం’ ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. కాగా.. గత నెలలో కూడా ఇదే అంశంపై కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీశాఖ ఓ ప్రకటన విడుదల చేయగా.. దానిపై స్పందన లేకపోవడంతో గెజిట్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-11T03:37:25+05:30 IST