Air India Express : యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మార్గదర్శకాలు
ABN , First Publish Date - 2022-12-28T08:23:24+05:30 IST
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమాన ప్రయాణీకుల కోసం కొవిడ్ మార్గదర్శకాలను...
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమాన ప్రయాణీకుల కోసం కొవిడ్ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.(Air India Express)యూఏఈ నుంచి భారతదేశానికి ప్రయాణించే వారందరూ(Passengers) మాస్క్‌లను ఉపయోగించాలని, విమానాల్లో భౌతిక దూరాన్ని అనుసరించాలని ఎయిర్ ఇండియా పేర్కొంది.(Covid Guidelines)12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోస్ట్-అరైవల్ కరోనా పరీక్ష అవసరం లేదని కూడా మార్గదర్శకాలు పేర్కొన్నాయి.కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టింది.
చైనాలో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలను సేకరించి కరోనావైరస్ పరీక్షలు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నందున చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులెవరికైనా పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచుతారు.చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు కూడా ప్రస్తుత ఆరోగ్య స్థితిని చూపించే ఎయిర్ సువిధ ఫారమ్‌లు తప్పనిసరిగా నింపాలని ఎయిర్ ఇండియా సూచించింది.