Bharat Jodo Yatra: ఫరీదాబాద్‌కు చేరిన భారత్ జోడో యాత్ర...ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
ABN , First Publish Date - 2022-12-23T09:46:07+05:30 IST
భారత్ జోడో యాత్ర శుక్రవారం హర్యానాలోని సోహ్నాలోని ఖేర్లీ లాలా నుంచి తిరిగి ప్రారంభమైంది...
ఫరీదాబాద్: భారత్ జోడో యాత్ర శుక్రవారం హర్యానాలోని సోహ్నాలోని ఖేర్లీ లాలా నుంచి తిరిగి ప్రారంభమైంది.(Bharat Jodo Yatra)శుక్రవారం ఫరీదాబాద్ చేరిన రాహుల్ గాంధీ యాత్ర(Congress leader Rahul Gandhi) రేపు ఢిల్లీకి చేరుకోనుంది.రాహుల్ పాదయాత్ర యాత్ర దృష్ట్యా నగరంలో జారీ చేసిన ట్రాఫిక్ సూచనలను పాటించాలని ఫరీదాబాద్ పోలీసులు సూచించారు.(Traffic Advisory)ఫరీదాబాద్ పోలీసులు భారత్ జోడో యాత్రను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నగరంలో భారీ ట్రాఫిక్ మళ్లింపులను జారీ చేశారు.ఈ యాత్ర పాలీ చౌక్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఫరీదాబాద్‌లోని గోపాల్ గార్డెన్, బద్కల్ మోర్ వద్ద విరామం కోసం ఆగనుంది.సెప్టెంబర్ 7వతేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పర్యటించి హర్యానాలో కొనసాగుతోంది.
ఢిల్లీలో జరిగే యాత్రలో ప్రముఖ నటుడు కమల్ హాసన్, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఇతర ఎంపీలు రాహుల్ గాంధీతో కలసి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.భారత్ జోడో యాత్ర మార్గాన్ని ఖరారు చేసిన తర్వాత దానికి సంబంధించి ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర 108వ రోజు శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.యాత్రలో రెండు రోజులు భారీ వాహనాల ప్రవేశాన్ని ఫరీదాబాద్‌లో నిషేధించారు. ట్రాఫిక్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రయాణికులు ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.