Rajya Sabha : బీజేపీ నేత సీఎం రమేశ్‌కు కీలక పదవి

ABN , First Publish Date - 2022-11-08T14:35:45+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

Rajya Sabha : బీజేపీ నేత సీఎం రమేశ్‌కు కీలక పదవి
CM RAMESH

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌ (Prakash Javadekar)కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవి లభించింది. రాజ్యసభ సచివాలయం ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) అనేక కమిటీలను పునర్నిర్మించి, నూతన చైర్‌పర్సన్లను నియమించారు. రాజ్యసభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ప్రకాశ్ జవదేకర్‌‌కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవి లభించింది. సీఎం రమేశ్‌కు హౌసింగ్ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి లభించింది. బీజేడీ ఎంపీ సుజీత్ కుమార్‌ను రాజ్యసభ పిటిషన్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. డీఎంకే ఎంపీ ఎం తంబిదురైని ప్రభుత్వ అస్యురెన్స్‌ల ప్యానెల్ సభ్యునిగా నియమించారు. బీజేపీ ఎంపీ కామాఖ్య ప్రసాద్ టసను కూడా ఓ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించారు.

రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్ లక్ష్మీకాంత్ బాజ్‌పేయీకి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్‌పర్సన్ పదవి లభించింది. ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా డెరెక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), సస్మిత్ పాత్రా (బీజేడీ), విజయసాయి రెడ్డి (వైకాపా) ఉన్నారు.

Updated Date - 2022-11-08T14:37:39+05:30 IST